గౌడ సంఘం అధ్యక్షుడికి సన్మానం

రుద్రూర్: స్థానిక గౌడ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మీసాల గోవింద్ గౌడ్‌ను గురువారం బీఆర్‌ఎస్‌ మండల నాయకులు కల్సి  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు గాండ్ల మధు, కొత్తపల్లి రవికిరణ్, డౌర్ సాయిలు, బొట్టే గజేందర్, సిరిగాద శేఖర్, జువ్వల శ్రావణ్ , షాదుల్ తదితరులు పాల్గొన్నారు.