హోమం, ప్రవచనం, అన్నదానము.. -గణనాథుని నామస్మరణతో  మారుమ్రోగుతున్న రుద్రూర్

రుద్రూర్ : మండల కేంద్రంలోని సార్వజని గణేష్ మండలి సిద్ది వినాయకుని 75 వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కుంకుమార్చన , హోమం ,ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతున్నారు. సోమవారం గణనాధున్ని తమలపాకులతో అలంకరించారు. హోమం నిర్వహించారు. సిద్దిపేటకు చెందిన బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ భక్తులకు ప్రవచనం ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.