విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

రుద్రూర్: ఎరా ఎలాగున్నావ్..ఎన్నాళ్లయిందో మిమ్మల్ని చూసి.. ఇంట్లో అందరూ బాగున్నారా… అంటూ నాలుగు దశాబ్దాల తరువాత వారు కలుసుకున్న బాల్య స్నేహితులు అప్యాయంగా పలుకరించుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని హైస్కూల్ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు. 1981-82లో ఎస్సైస్సీ పూర్తి చేసుకున్న అనంతరం ఉద్యోగ, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిర పడ్డ వారందరు వచ్చి గత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. చదువు చెప్పిన గురువులను సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గురువులు పి.రవి కిరణ్, రాధారాణి, ఎంఈవో శ్రీనివాస్ ,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.