రుద్రూర్: ఐకెపి ఏపీఎంగా భాస్కర్ సేవలు అభినందనీయమని మహిళ సమాఖ్య మండల అధ్యక్ష, ఉపాద్యాక్షులు దృపతి, పావని కొనియాడారు. తొమ్మిదేళ్లు ఏపీఎంగా విధులు నిర్వర్తించి కోటగిరికి బదిలీపై వెళుతున్న భాస్కర్ ను మంగళవారం మండల కేంద్రంలో మహిళ సమాఖ్య, ఐకెపి సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరితో ఒపికగా మాట్లాడి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించారని అన్నారు. గ్రామాల్లో ప్రతి మహిళ సంఘానికి ప్రయోజనం చేకూర్చారని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సంపత్ కుమార్, కెనరా బ్యాంక్ మేనేజర్ దారవత్ ఈరు, రుద్రూర్ మండల ఐకెపీ ఏపీఎం బస్వంత్ రావ్, సీసీలు నాగరాజు, పద్మ, ఐకెపి సిబ్బంది, వివిధ గ్రామాల మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.


