-సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
రుద్రూర్ : గ్రామ పూర్వ విద్యార్థులంతా కలిసి ఏర్పాటుచేసి, రైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ప్రశంసించారు. వర్ని మండల కేంద్రంలోని విఎంఆర్ గార్డెన్లో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ & రైడ్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైడ్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని స్క్రీన్ పై స్వయంగా వీక్షించారు. అనంతరం తన ప్రసంగంలో రైడ్స్ పేరును ప్రస్తావిస్తూ… ప్రశంసల జల్లులు కురిపించారు. యువకుల కృషితో అభివృద్ధి చెందిన హివారే బజార్, రాలేగావ్ సిద్ధికి, గంగాదేవి పల్లి వంటి గ్రామాలును తాను స్వయంగా సందర్శించానని.. అలాంటి ఆదర్శ గ్రామాలుగా తయారు కావడానికి యువత కృషి చేయాలని సూచించారు. యువకులందరూ కలిస్తే ఇది సాధ్యమేనని పేర్కొన్నారు.
