ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు

రుద్రూర్: మండలంలోని ఆలయాల వద్ద బుధవారం భక్తులు కార్తీక దీపాలు వెలిగించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువు వద్దకు వెళ్లి చంద్ర బాగ గంగా హరతి ఇచ్చి కార్తీక దీపాలను చెరువులో వదిలారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అంగడి బజార్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ సర్పంచ్ బద్దం వసంత ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష వత్తులతో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.