విద్యార్థులకు కంటి పరీక్షలు- మోటివేషన్ క్లాస్

రుద్రూర్ : మండల కేంద్రంలో రైడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు  లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సహకారంతో  కంటి పరీక్షలు నిర్వహించారు. బోధన్‌కు చెందిన లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య బృందంకంటి పరీక్షలు చేశారు.
అవసరమగు  వారికి కంటి అద్దాలు వాడాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.  భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే లక్ష్యసాధనతో ముందుకు సాగాలని సూచిస్తూ మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ యార్లగడ్డ శ్రీనివాస్ విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు  కె.వి. మోహన్, కార్యదర్శి గుండూరు ప్రశాంత్ గౌడ్, సీనియర్ సభ్యులు ఇందూర్ చంద్రశేఖర్, శ్యామ్‌సందర్ పహాడే, ప్రవీణ్ కారంగుల,  గెంటీల గంగాధర్,  ప్రశాంత్ , లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యుడు అజయ్, కోఆర్డినేటర్లు హనుమంతరావు, రఫీ, రైడ్స్ సభ్యులు పాల్గొన్నారు.