కోటగిరి : మండల కేంద్రంలోని మాలివాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం ముమ్మలనేని రాజశేఖర్ సహకారంతో స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈసందర్భంగా ఎంఈఓ నాదెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ… రాజశేఖర్ సేవా తత్పరత గూర్చి కొనియాడారు. సంపన్నులు చాలామంది ఉంటారు కానీ పేదలకు సహాయ సహకారాలు కొంతమంది మాత్రమే అందిస్తారని, వారిలో రాజశేఖర్ ఒకరిని అన్నారు. గతంలో పాఠశాలకు వాటర్ ప్లాంట్, దుస్తులు అందజేశారని పేర్కొన్నారు. పిఆర్ టియు రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షుడు శానం సాయిలు, స్కూల్ చైర్మన్ సావిత్రి, హెడ్ మాస్టర్ గంగరాజులు , కిరణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
