మోస్రా: మండల కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో నాగనాథ్, ఏపీఎం ముఖిమ్, కార్య దర్శి శ్రావణ్, సూపర్ వైజర్ సుమలత, అంగన్వాడి యూనియన్ మండల అధ్యక్షురాలు కరుణ తదితరులు పాల్గొన్నారు.
