పీసీసీ అధ్యక్షుడితో పార్టీ నేతల  భేటీ

రుద్రూర్:  పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. బాన్సువాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ (బి) అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రుద్రూర్ మండలానికి సంబంధించిన పలు సమస్యలు, స్థానిక అభివృద్ధి అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నాయకులు పిసిసి అధ్యక్షుడితో విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల కృషిని పిసిసి అధ్యక్షుడు అభినందిస్తూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  పిసిసి అధ్యక్షుని కలిసిన వారిలో పార్వతి శేఖర్ ,కాసుల శ్రీనివాస్, పార్వతి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.