రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నాటికలు, పాటల ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై చక్కని సందేశాలను అందించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ, నాలుగు చక్రాల వాహనాల్లో సీట్‌బెల్ట్ వాడకం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, నష్టం గురించి అవగాహన కల్పించారు.
“హెల్మెట్ బరువు కాదు… బాధ్యత” అనే నినాదంతో వాహనదారులు భద్రతా నియమాలు పాటించాలని ,సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఎస్సై సాయన్న, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.


