ఎమ్మార్పీఎస్ నేత పరామర్శ

పోతంగల్ : మండలంలోని సోంపూర్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం ను శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పోచిరాం  గాయపడ్డాడు . బోధన్  పట్టణానికి వచ్చిన  మంద కృష్ణ విషయం తెలుసుకుని సోంపూర్ గ్రామానికి వచ్చి పోచిరాం ఆరోగ్య పరిస్థితి గూర్చి ఆడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు కె. ప్రమోద్, ఎమ్మార్పీస్ నాయకులు బాలు, మారుతి తదితరులు ఉన్నారు.