నేడు రుద్రూర్ లో  కామ దహనం

రుద్రూర్: మండల కేంద్రంలో బుధవారం రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్ర శేఖర్, గోశాల, పతంజలి యోగ కేంద్రం సభ్యులు తెలిపారు. రాత్రి నిర్వహించే కామదహన కార్యక్రమానికి మల్లారం పిట్ల కృష్ణ మహరాజ్ ముఖ్య అతిధిగా వస్తున్నారని పేర్కొన్నారు. కామ దహనంలో వేయడానికి ఆవు పిడకలు, గోమయ సమిధలు గోశాల లభిస్తాయని తెలిపారు. భారతీయ సంసృ్కతి, సంప్రదాయ బద్దంగా నిర్వహించే కామదహనం కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాల్సిందిగా వారు కోరారు.