బాధిత కుటుంబాలకు పరామర్శ

రుద్రూర్: ఆర్టీసీ మాజీ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ మండల కేంద్రంలో బుధవారం పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగుల లలేందర్ (63) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రూ. 20వేలు ఆర్ధిక సహయాన్ని అందచేశారు. అనంతరం ఫ్రూట్ యూసుప్, బాబాన్ కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు గాండ్ల మధు, డౌర్ సాయిలు, శేఖర్, కన్నె రవి, బొట్టే గజేందర్, నీరడి సాయిలు, కన్నె ప్రవీణ్ తదితరులు ఉన్నారు.