పూర్వ విద్యార్థుల అల్పాహారం

రుద్రూర్ : దుర్గామాత శరన్నవరాత్రుల సందర్భంగా  జడ్పిహెచ్ఎస్ రుద్రూర్ పూర్వ విద్యార్థులు శుక్రవారం భక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గట్టు ఆనంద్, నూతి పల్లి బాలరాజ్, కన్నె రవి, సూరజ్ శ్రీనివాస్, కర్రల శివప్రసాద్, పుట్టి ప్రకాష్, రాజన్న, కొండ సుదర్శన్ ప్రత్యక్షంగా పాల్గొనగా, మరి కొంతమంది పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరించారు.