– మోకాల శాస్త్ర చికిత్స కొరకు ఎల్ ఓ సి అందజేత
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన గోలి సుబ్బ లక్ష్మీ మోకాళ్ల నొప్పి తో బాధపడుతున్నట్టు తెలుసుకున్న విండో మాజీ చైర్మన్ పత్తి రాము ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆపద్బాంధవుడిగా నిలిచారు. శస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి కింద రూ. 75 వేలు చెక్కును అందించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
