
కోటగిరి: కోటగిరి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన బర్ల మధును సోమవారం పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రభాకర్, జి. అశోక్, కృపాకర్ రావు, డి. ప్రభాకర్, బర్ల సత్యనారాయణ, జి. గంగాధర్‌లు సర్పంచ్ బర్ల మధుకు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌గా బాధ్యతాయుతంగా పని చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
