కోటగిరి :మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో గురువారం పీఆర్టియు క్యాలెండర్లను తహసీల్దార్ గంగాధర్, ఎంఈవో శ్రీనివాస్ రావ్ అవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయు మండల అధ్యక్షుడు బర్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి డి. ఉదయ చందర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంగారాజు, శానం సాయిలు, యు. సుధీర్, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు హర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మోహన్, మండల అసోసియేట్ అధ్యక్ష కార్యదర్శులు ఎండీ పాష, ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.
పోతంగల్: మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయంలో గురువారం పీఆర్టీయు నూతన సంవత్సర క్యాలెండర్ ను తహసీల్దార్ మల్లయ్య, ఎంఈవో లోల శంకర్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగనాథ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రశాంత్ కిరణ్ బాబు, శ్రీరామ్, హన్మాండ్లు, అబ్దుల్ ఖాదర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు, మండల అసోసియేట్ అధ్యక్షులు అంజాద్, మండల కార్యదర్శి ప్రభాకర్ పాల్గొన్నారు.

