రుద్రూర్ ఎస్సై ఔదార్యం

రుద్రూర్: దివ్యాంగుడి కుటుంబంపై  రుద్రూర్ ఎస్సై సాయన్న మానవత్వాన్ని చూపించాడు.  దివ్యాంగుడిని ఆయన భార్య , కూతురు వీల్ చైర్ పై నెట్టుకుంటూ వస్తున్న దృశ్యం శనివారం ఎస్ఐ కంటపడింది.  చలించిపోయిన ఎస్సై వెంటనే తన వాహనాన్ని నిలిపివేసి వారి దగ్గరకు వెళ్లి తనకు తోచిన  ఆర్థిక సహాయాన్ని అందజేశాడు.  నేటి సమాజంలో అన్ని వసతులు ఉన్న దంపతుల మధ్య సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ  ఏమీ లేకపోయిన దివ్యాంగుడైన భర్తకు సేవా చేస్తూ అన్యోనముగా ఉంటున్న ఈ దంపతులు అందరికి ఆదర్శమని ఎస్సై వారిని అభినందించారు