రుద్రూర్ (స్థానికం న్యూస్): మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో రుద్రూర్ అయ్యప్ప సేవా సమితి అధ్వర్యంలో ఆదివారం శ్రీ అయ్యప్ప స్వామి సామూహిక మహపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు గురు స్వామి పద్మ ప్రదీప్, శ్యాం స్వామి, పత్తి రాము స్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మాలధారణ స్వామలు, భక్తులు, హిందూ బంధువులు హాజరై అయ్యప్ప దర్శనాన్ని చేసుకోవాలని కోరారు.

