అన్నప్రాసన, సీమంతాలు

రుద్రూర్: మండల కేంద్రంలోని మూడు అంగన్వాడి కేంద్రాల్లో సోమవారం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్య వంటి సేవల ప్రాముఖ్యతను ఆమె వివరించారు. మహిళలు, తల్లులు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిస్సార్, అంగన్వాడీ టీచర్లు వంజరి పద్మ, ఎన్. రూప, పి. ప్రతిమ, హెల్త్ సూపర్ వైజర్ సుమతి, హెల్త్ అసిస్టెంట్స్ గౌరి, శిరీష, వార్డు సభ్యులు వెంకటేశ్వర్, సాగరిక, పార్వతి, విమల, అశావర్కర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.