రుద్రూర్: మహిళలు, చిన్నారులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తహసీల్దార్ తారాబాయి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో గల పోషకాల విలువల గుర్చి వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ కుమార్, శ్వేత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీలత, హెల్త్ సూపర్ వైజర్ జ్యోతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నరేష్, డీఎంసీ స్వప్న, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



