
రుద్రూర్: బోధన్ పట్టణంలోని శివాలయం వద్ద నుంచి వీరేశం, సాయిలు, రామేశ్వరరావు అనే ముగ్గురు శివదీక్ష మాలధారణ స్వాములు గురువారం కాలినడకన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు.
ఈ సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ పత్తి రాము స్వాములకు ఘనంగా స్వాగతం పలికారు. పళ్ళు, పాలు సేవగా అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. బోధన్ నుండి శ్రీశైలం పాదయాత్ర గా వెళ్ళడం ఇది మూడోసారి అని స్వాములు పేర్కొన్నారు.
మార్గమధ్యంలో వర్ని, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో మరిన్ని దీక్షా స్వాములు తమ పాదయాత్రలో కలుస్తారని స్వాములు తెలిపారు. మొత్తం 13 రోజుల్లో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పత్తి నవీన్, అడప నవీన్, ఈర్వ అనిరుద్, సంతోష్ , అక్కపల్లి నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


