కోటగిరి : మండల కేంద్రంలోని శ్రీ వేద హై స్కూల్ లో గురువారం సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ముగ్గులు వేశారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ… ముగ్గులు సాంప్రదాయాలకు చిహ్నమని , నేటి విద్యార్థులు ముగ్గులను మరిచిపోయే పరిస్థితి ఉందని , వాటిని భావితరాలకు గుర్తు చేసేలా స్కూల్ విద్యార్థులకు రంగోలి పోటీలను నిర్వహించామన్నారు. విద్యార్థులు పర్యావరణం పరిరక్షణ , సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేలా వివిధ రకాల ముగ్గులను వేశారు ఉత్తమ ప్రతిభ కనబరిచి ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్ ప్రిన్సిపల్ అక్షర, ఉపాధ్యాయ బృందం నిర్మల, రేష్మ ,చంద్రకళ ,నందిని ,షామిలి, హారతి, సంధ్య రమ్య శిరీష శ్రీలత సంగీత ప్రవళిక సునీత సావిత్రి సాయి పవన్ ,సాయిరాం ,భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.
