రుద్రూర్: 1990-91 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు సోమవారం రాత్రి స్థానిక వాణి సాహితి పబ్లిక్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న తమ బ్యాచ్ కి చెందిన మిత్రులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో లోగం నాగరాజు, మహజన్ నర్సింలు, సునీత జలోజి, కర్రోల్ల కృష్ణ ప్రసాద్, వాసవి, సరస్వతి నాగరాజు, సాయిలీలవిజయ్, గాయత్రి గజేందర్, సునీత హన్మాండ్లు , మహాజన్ భవాని ఉన్నారు. వీరిలో గత పది నుండి 30 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకొని వీరు అందిస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.,.ఉపాద్యాయులుగా విధులు నిర్వహించడం ఎంతో సంతృప్తి ఇస్తుందని పేర్కొన్నారు.

స్నేహితులు