చిన్నారులకు యూనిఫామ్‌ పంపిణీ

కోటగిరి : మండలంలోని ఎత్తొండ క్యాంప్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం పిల్లలకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గైని వీరమణి అర్జున్ పాల్గొని చిన్నారులకు యూనిఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…చిన్నారుల విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు.  అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు యూనిఫామ్‌లు అందడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.