మహా గర్జన సభ జయప్రదం చేయాలి

రుద్రూర్:  ఈనెల 23న బోధన్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించబోయే మహాగర్జన సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
భూమయ్య మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో  మాట్లాడుతూ..
ఈ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని వెల్లడించారు. దివ్యాంగులు ,చేయుత పింఛన్ దారులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేయూత పింఛన్లు పెంచుతామని చెప్పి  రెండేళ్లు కావస్తున్న  పింఛన్ లు పెంచకుండా  మోసం చేస్తున్నారని అన్నారు. పద్మశ్రీ  మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటాల ద్వారానే పింఛన్ల పెంపును సాధించుకుంటామని స్పష్టం చేశారు.  విహెచ్ పీఎస్ మండల అధ్యక్ష ,కార్యదర్శులు జె.సాయిలు , మోహన్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, నగేష్ ,నజీరా బేగం,  గంగా, తహిర బేగం, హన్మండ్లు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.