కోటగిరి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి పురస్కారించుకుని మహిళ ఉపాద్యాయులను శనివారం ఎంఈవో శ్రీనివాస్ రావ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ…., సావిత్రి బాయి పూలే మహిళ విద్యా కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలని అని పేర్కొన్నారు.
కోటగిరి పీఆర్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్, ఎంఈవో శ్రీనివాస్ రావ్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయు మండల అధ్యక్షుడు బర్ల సాయిలు, కార్యదర్శి ఉదయ్చిందర్, పాఠశాల ఉపాద్యాయలు పాల్గొన్నారు.


