హరిద్వార్ కు రుద్రూర్ యోగ సభ్యులు

రుద్రూర్ : మండల కేంద్రం నుంచి 11 మంది యోగ సభ్యులు ముఖ్య యోగా శిక్షణ కోసం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు గురువారం బయలుదేరారు. శ్రీ రాందేవ్ బాబా ఆధ్వర్యంలో ముఖ్య యోగ శిక్షణ వీరు పూర్తి చేయనున్నట్టు పతాంజలి యోగ సమితి రాష్ట్ర మీడియా ఇంచార్జ్ విశ్వనాథ్ మహాజన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో యోగ సమితి సభ్యులు బెజగం వెంకటేశం, పుట్టి ప్రకాష్, చిదుర మహిపాల్, కర్రోళ్ల శివప్రసాద్ ,నూతిపల్లి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.