రుద్రూర్ : మండల కేంద్రంలో గురువారం అమ్మనాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పేదలకు చలి నుండి ఉపశమనం కల్పించడానికి దుప్పట్ల ను అందజేసినట్టు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు . కార్యక్రమంలో అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసుబాబు, తాజా మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, మాజీ వార్డు సభ్యులు మేకవెంకటేశ్వరరావు , ట్రస్ట్ సభ్యులు శ్యామల, రత్న వేణి, ఆలయ అర్చకులు శివప్పా, యువరాజు తదితరులు పాల్గొన్నారు.
