రుద్రూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం వైఎస్సార్ జయంతి నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నితిన్ పటేల్, విండో మాజీ చైర్మెన్ పత్తి రాము, విండో డైరక్టర్ కర్క అశోక్, మండల నాయకులు తోట సంగయ్య, ఇందూర్ కార్తీక్, వడ్ల నరేష్, నిస్సార్, పుర్కన్, పార్వతి ప్రవీణ్, మోత్కురి నారాయణ, మహేష్, గాండ్ల శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
