బాధితునికి ఆర్థిక సహాయం

కోటగిరి:  మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ (20) అనే యువకుడు ఇటీవల ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామ యువకులు కమలేష్, వాసు, సురేష్, సాయిలు, పవన్, మహేందర్, విజయ్, రజిని, శ్రీనివాస్, అవినాష్, బస్వరాజ్ తదితరులు కలిసి రూ.30 వేలు సమకూర్చి బాధిత కుటుంబానికి అందజేశారు. అలాగే పోతంగల్ గ్రామానికి చెందిన సితాలే రమేష్ వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల ఆయన స్నేహితులు దత్తు పటేల్,కిరణ్ కల్లూరు,పంచరెడ్డి తదితరులు  రూ. 18వేలు జమచేసి బాధితునికి అందజేశారు. కార్యక్రమంలో గోగినేని విజయ్, కొడాలి శ్రీనివాస్,కుర్లేపు నగేష్,కుర్లేపు శ్రీనివాస్, గోపు సాయిలు.చించెల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు.