రుద్రూర్: మండల కేంద్రంలో నాలుగు తర్పల మున్నూరు కాపు సంఘ సభ్యులు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా పత్తి రాము, ప్రధాన కార్యదర్శిగా ఇందూర్ కార్తీక్, కోశాధికారిగా పార్వతి శేఖర్, ఉపాధ్యక్షులు గా అడ్ప సాయిలు, కర్క అశోక్, కొప్పర్గా గంగాధర్, జల్లపురం సాయికుమార్, సహాయ కార్యదర్శులుగా అడ్ప శంకర్, ఉప్పు గంగాధర్, ఇందూర్ తులసి రామ్, జల్లపురం సాయిలును ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా ఇందూర్ చంద్రశేఖర్, దుర్కి సాయన్న, పత్తి లక్ష్మణ్, కొట్న లక్ష్మణ్, జక్కు నర్సింలు, తోట్ల గంగారాం, నాగం అశోక్, చంద రవికుమార్, కాసుల శ్రీనివాస్, జిల్లాపురం నడిపి సాయిలుతో పాటు 19 మంది డైరెక్టర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు వివరించారు.

