ఘనంగా జన్మదిన వేడుకలు

రుద్రూర్ : మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ…బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల ఇంచార్జి గాండ్ల మధు, డౌర్ సాయిలు, వినీత్ , గోపి, అల్లావుద్దీన్, సంగమేశ్వర్, శ్రావణ్ , శేఖర్ , పార్వతి ప్రవీణ్, జక్రి నరేందర్, బొట్టే గజేందర్, క్లిక్ రవి, కర్రోల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రుద్రూర్ లో మాజీ సీఎం కేసీఆర్ , మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు