
పోతంగల్ : మండలంలోని చేతన్‌నగర్ గ్రామంలో సర్పంచ్ కాంత సునీల్ ఆధ్వర్యంలో, పోతంగల్ ప్రెస్ క్లబ్ సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన వృద్ధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి తదుపరి వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు తెలిపారు .సర్పంచ్ కాంత సునీల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పోతంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పున్నే అర్జున్, ఉపాధ్యక్షుడు గంధపు దత్తు, ప్రధాన కార్యదర్శి వడ్ల సురేష్, కార్యదర్శి బ్యాగరి విజయ్‌కుమార్, సహాయ కార్యదర్శి ఎర్రోళ్ల యాదవరావు, కోశాధికారి సర్గు లక్ష్మణ్, గౌరవ సలహాదారులు కనకమెడల శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ పాకాల గజేందర్, కార్యవర్గ సభ్యులు మొండే భీమ్‌రావు, రాజేష్, ముత్యాల శ్రీకాంత్, షేక్ అజారుద్దీన్, సద్దాం, శ్రీను, ఉప సర్పంచ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
