కోటగిరిలో ఉచిత వైద్య శిభిరం

కోటగిరి : గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం బోధన్ లయన్స్ జనరల్ ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. శిభిరంలో 2వందల మందికి సాధారణ చికిత్సలు, షుగర్ పరీక్షలు,  80 మందికి కంటి పరీక్షలు చేశారు.  ఉచితంగా మందులు ఆందచేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో విష్ణు, ఎస్సై శ్రీనివాస్, వైద్యులు విక్రమ్, ఆజయ్, యశస్విని, లయన్స్ సభ్యులు సాయి శ్రీనివాస్, హన్మంతురావ్, వెంకటేశ్వరరావు , సాయిబాబా, శ్రీధర్, సుబ్బారావ్ తదితరులు పాల్గొన్నారు.