కోటగిరి : పాలిసెట్–2026 తుది విడత వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సోమవారం ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
జూన్ 16, 17 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తో పాటు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు.
కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 99482 64254, 90102 22190 నంబర్లను సంప్రదించవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు. పాలిటెక్నిక్ విద్యలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
