ఉచిత నేత్ర వైద్య శిబిరం

రుద్రూర్ :  మండలంలోని చిక్కడపల్లి  చెరువులో ఉపాధి పనులు చేస్తున్న  కూలీల కోసం మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్  మచ్కూరి రమేష్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో  116 మందికి కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా కంటి చుక్కల మందులు పంపిణీ చేశారు. 12 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ కె.వి. మోహన్ మాట్లాడుతూ.. ఎండలో శ్రమిస్తున్న కూలీలకు వైద్య సేవలు అందించడం సంతోషకరమన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన క్లబ్ సభ్యులు, గ్రామ సర్పంచ్ మచ్కూరి రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అవసరమైన చోట వెంటనే వైద్య సిబ్బంది, ఆసుపత్రి బస్సును పంపించి సేవలు అందిస్తున్న లయన్స్ కంటి ఆసుపత్రి ఫౌండర్, మాజీ గవర్నర్ లయన్ బసవేశ్వరరావు, ట్రస్ట్ సభ్యుల సేవలను అభినందించారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, సభ్యులు లయన్ పార్వతీ ప్రశాంత్, ఆసుపత్రి సిబ్బంది హన్మంత్‌రావు, రఫీ, వైద్యులు కె. అజయ్, వార్డు సభ్యులు బేగరి గోపి, మంజుల, సావిత్రి, జెల్ల సాయిలు, గ్రామస్తులు నక్క గంగారాం, హన్మంతు, పోశెట్టి, లస్మయ్య, గజేందర్, విట్టల్, సునీత తదితరులు పాల్గొన్నారు.