
కోటగిరి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) విధానం ప్రకారం ఆగస్టు 6 నుంచి యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్‌తో పాటు అన్ని రకాల రసాయన ఎరువుల విక్రయాలు తప్పనిసరిగా ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎఫ్ఎఫ్ఎస్ విధానం అమలుతో ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా, నిల్వల పర్యవేక్షణ, సబ్సిడీ ఎరువుల పంపిణీ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుమతి పొందిన లైసెన్స్ కలిగిన ఎరువుల విక్రయ కేంద్రాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు.
ఆగస్టు 6 నుంచి యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్‌తో పాటు అన్ని రకాల ఎరువుల విక్రయాలను ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో నమోదు చేసి మాత్రమే విక్రయించాలని, నిబంధనలను ఉల్లంఘించిన డీలర్లపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (ఎఫ్సీఓ) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి రాజు హెచ్చరించారు.
