రుద్రూర్: భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను, కల్యాణ శేష వస్త్రాలను నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పారుపల్లి శ్రీరామ్ మధుమతి దంపతులకు బుధవారం శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అందజేసి ఆశీర్వదించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.,. భద్రాచల రామయ్య కళ్యానానికి గోటితో వడ్లు ఓలిచి అందించి రామభక్తిని చాటుకున్నారన్నారు. అందుకే వీరికి సేవలను కొనియాడి ముత్యాల తలంబ్రాలు అందించామన్నారు. ధార్మిక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడంలో ముందుందే వ్యక్తి అని వారి సేవలను కొనియాడారు.


