ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రుద్రూర్‌:  మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో
శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పార్టీ అధ్యక్షులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ పతాకానికి వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పలువురు పేర్కొన్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.