సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా వందనం

కోటగిరి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటగిరి మండల సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో శనివారం కా జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు బర్ల సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో పోల విఠల్ సేటు, తాటి వీరేశం, గంగాధర్ గౌడ్, జి. అశోక్, గర్దాస్ గంగాధర్, ప్రభాకర్ ,పుల్లెల మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.