బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

పోతంగల్‌: బాల్య మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు పోతంగల్‌ మండలం 2001–02 పదో తరగతి బ్యాచ్‌ స్నేహితులు. హంగర్గ ఫారం గ్రామానికి చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ ఇటీవల దుర్కి ఎక్స్‌ రోడ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు నలుగురు పిల్లలు ఉండగా, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో ఇస్మాయిల్‌తో కలిసి చదువుకున్న పోతంగల్‌ 2001–02 పదో తరగతి బ్యాచ్‌ స్నేహితులు తమ వంతు సహాయంగా రూ.40 వేల ఆర్థిక సాయాన్ని ఆయన కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు.  కార్యక్రమంలో సీతలే రమేష్‌, పబ్బ శేఖర్‌, బి. సాయిలు, కిరణ్‌, సుధాకర్‌రెడ్డి, సలీం, రషీద్‌, సజ్జత్‌, మహేష్‌, లింగురం, సంతోష్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.