గౌడ సంఘం అధ్యక్షుడిగా గోవింద్‌గౌడ్

రుద్రూర్:   గౌడ సంఘం అధ్యక్ష పదవికి మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. సంఘంలో మొత్తం 86 మంది ఓటర్లు ఉండగా 83 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో మీసాల గోవింద్‌గౌడ్ 48 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రత్యర్థి గుండూరు విట్టల్‌గౌడ్‌కు 25 ఓట్లు, శంకర్‌గౌడ్‌కు 10 ఓట్లు పోలైనట్లు సంఘ సభ్యులు తెలిపారు. విజయం సాధించిన గోవింద్‌గౌడ్‌ను సంఘ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు, పెరిక సంఘం జిల్లా సభ్యులు కన్నెరవి  తదితరులు అభినందించారు.