పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

రుద్రూర్‌: మండల కేంద్రంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో   పోషణ  మాసోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాశన, వేల్ బేబీ షో , వంటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి బోధన్‌ సీడీపీఓ నందిని ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని అన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. పోషణ వారోత్సవాల ఉద్దేశం, పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, పీఎస్‌హెచ్‌ఎం కృష్ణవేణి , హెల్త్ సూపర్‌వైజర్ జ్యోతి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు శృతి, గోపిలక్ష్మి ,ఆసియా ,కొమరమ్మ  పాల్గొని పోషకాహార ప్రాముఖ్యతపై దిశానిర్దేశం చేశారు. అంగన్వాడి టీచర్లు పద్మ , ప్రతిమ, గంగమణి ,సావిత్రి, సునంద, రూప  తదితరులు పాల్గొన్నారు.