

రుద్రూర్: మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సార్వ గణేశుని లడ్డును మాజీ ఎంపీటీసీ పట్టేపు రాములు నాలుగోసారి సొంతం చేసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు గ్రామస్తుల సహకారంతో గణనాథులను నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు.nకోలాటాలు, నృత్యాలతో యువత సందడి చేస్తూ శోభాయాత్రలు నిర్వహించారు. కొన్ని విగ్రహాల ఊరేగింపులు అర్ధరాత్రి వరకు కొనసాగనున్నాయి. బుధవారం తెల్లవారుజామున నిమజ్జనం చేశారు.


