తత్వ దృష్టితో జీవనం సాగించాలి

రుద్రూర్‌: మండల కేంద్రంలోని సార్వజనిక గణేష్‌ మండలి ఆధ్వర్యంలో 76వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం 76 రకాల స్వీట్లతో గణనాథుడికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన బ్రహ్మర్షి గోసాం శివప్రసాద శాస్త్రి భక్తులకు ప్రవచనం చేశారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి, సత్యాన్ని గ్రహించే తత్వ దృష్టి అవసరమన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతోపాటు తత్వ చింతన కలిగి ఉండటం ద్వారా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు.  ప్రవచనం వినడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.