
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయకుని నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం గణపతికి 108 రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ ఆవరణలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాత్రి అయ్యప్ప భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు.

