

పోతంగల్: మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామపంచాయతీలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హజరైన జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజీకంగా ఎదగాలన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, సాధికారత పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ కొమరవ్వ మాట్లాడుతూ..పోషకాహారం, తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు ,ఉప సర్పంచ్ , స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, చిన్నారుల తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.


