శ్రీ పోతలింగయ్య స్వామి ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన

రుద్రూర్: మండల కేంద్రంలోని కందూర్ గల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతలింగయ్య స్వామి ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. శాంతి సూక్త పఠనం, గణాధిపతి పూజ, గోపూజ, యాగశాల హోమం, యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.